బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్..ఇటీవల రణ్ బీర్ కపూర్ ను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే. ప్రొఫెషనల్ గా ప్రజెంట్ ఇద్దరు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ నెల 7 నుంచి బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ ఏడో సీజన్ స్టార్ట్ కానుంది.
ఈ సీజన్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నది. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు వచ్చిన సెలబ్రిటీల్లో కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో నెట్టింట బాగా వైరలవుతోంది. ఆలియా భట్ ఇందులో తన ఫస్ట్ నైట్ గురించి పంచుకున్నట్లు సమాచారం. కొత్తగా పెళ్లయిన ఆలియాను కరణ్ ఏదైనా విషయం చెప్పాలని అడగగా ‘ఫస్ట్ నైట్’ గురించి బోల్డ్ గా చెప్పేసింది.
ఎవరికైనా ఫస్ట్ నైట్ ఉండబోదని, ఆ సమయానికి చాలా అలసిపోయి ఉంటామని ఆలియా భట్ తెలిపింది. ఆలియా భట్ తొలి రాత్రి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. మొత్తంగా ఆలియా భట్ తన భర్త రణ్ బీర్ కపూర్ తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుందని ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.