ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా సొంత బొమ్మతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేయగలడా? చేసి గెలిచే దమ్ము ఉందా? అంటూ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి ఏమి పెద్ద లీడర్ కాదు అంటూ మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పుంగనూరు లో కూడా మాదే విజయం అని అన్నారు నల్లారి కిషోర్ కుమార్. పెద్దిరెడ్డి కి తెలిసిందల్లా దోచుకోవడం, దాచుకోవడమే అంటూ మండిపడ్డారు. పెద్దిరెడ్డి తన రాజకీయ జీవితంలో నాలుగు సార్లు ఓడిపోయారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. 30 సంవత్సరాల తర్వాత నారా చంద్రబాబు నాయుడు మా ఇంటికి రావడం సంతోషకరంగా ఉందని అన్నారు.