బ్రెజిల్ లో ఘోర ప్రమాదం… 62 మంది మృతి

-

All 62 On Board Killed In Brazil Plane Crash: బ్రెజిల్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కూలిపోవడంతో.. ఏకంగా 62 మంది మరణించారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం బ్రెజిల్‌లోని సావో పాలో సమీపంలో 62 మందితో ప్రయాణిస్తున్న ప్రాంతీయ టర్బోప్రాప్ విమానం కూలిపోయిందని స్థానిక అధికారులు వెల్లడించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో విమానంలో ఉన్న వారందరూ మరణించారని క్రాష్ సైట్ సమీపంలోని స్థానిక అధికారులు తెలిపారు.

All 62 On Board Killed In Brazil Plane Crash

సోషల్ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ప్రకారం… ATR-నిర్మిత విమానం గాడి తప్పి… తిరుగుతున్నట్లు కనిపించింది. అది ఇళ్ళకు సమీపంలో ఉన్న చెట్ల సమూహం వెనుకకు పడిపోయిందట. దాని తర్వాత పెద్ద ఎత్తున నల్లటి పొగలు వచ్చాయి. విమానం పడిన చోట అంటే కండోమినియం కాంప్లెక్స్‌లోని ఒక ఇల్లు మాత్రమే దెబ్బతిన్నదని, అయితే అందులో ఉండే నివాసితులు ఎవరూ గాయపడలేదని చెప్పారు అధికారులు. కానీ విమానంలో ప్రయాణించిన వారు మరణించినట్లు దృవీకరించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news