ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు బన్నీ దూరం…

-

స్వర్గీయ నందమూరి తారకరామారావు వందవ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని కైతలపూర్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరపనున్నారు. అయితే ఈ వేడుకలకు రావాల్సిందిగా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఎవరెవరు వచ్చి ఈ ఉత్సవాల్లో పాలు పంచుకుంటారన్న దానిపైన మాత్రం ఒక క్లారిటీ రావడం లేదు. ఇప్పటికీ ఆయన అంశతో పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉత్సవాలకు రావడం లేదని కంఫర్మ్ చేశాడు, ఏవో వ్యక్తిగత కారణాలతో బిజీ గా ఉండడం వలన రావడం లేదని అతని వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం. కాగా తాజాగా అల్లు అర్జున్ సైతం ఈ ఉత్సవాలకు వెళ్లడం లేదని తెలిసింది.

సోషల్ మీడియాలో ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ బన్నీ ఈ ఉత్సవాలకు వస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు.. అల్లు అర్జున్ టీం నుండి పుష్ప సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం వలన ఈ ఉత్సవాలకు రావట్లేదని క్లారిటీ ఇచ్చాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version