క్రిస్టియన్స్ అందరూ ఏకమై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని, ఆయన్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలారెడ్డి పిలుపునిచ్చారు. క్రైస్తవుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతున్న వీడియోను జనసేన నేత ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.‘ఇది రా మతతత్వ రాజకీయం అంటే! పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎన్నికల కోసం హిందువులు ఏకం కండి అనలేదు. మీ హక్కుల కోసం ఏకం కమ్మన్నాడు! దేశ సమగ్రత కోసం ఏకంకమ్మన్నాడు’ అని చెప్పుకొచ్చారు.
ఆ వీడియోలో వైఎస్ విమలారెడ్డి మాట్లాడుతూ..వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కువ అయ్యారని, ఇప్పుడు అతను ఒంటరి వాడయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో క్రైస్తవులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. మనం అందరం ఏకమై.. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, వైసీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.వచ్చే ఎన్నికలలోపు అందరూ ఏకం కావాలన్నారు. క్రైస్తవులంతా ఏకమైతే సాధించలేనిది ఏదీ లేదంటూ ఆమె ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.కాగా, ఈ వీడియో ఎప్పటిదో అనేది తెలియాల్సి ఉంది.
ఇది రా మతతత్వ రాజకీయం అంటే! పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎన్నికల కోసం హిందువులు ఏకం కండి అనలేదు. మీ హక్కుల కోసం ఏకం కమ్మన్నాడు! దేశ సమగ్రత కోసం ఏకంకమ్మన్నాడు!pic.twitter.com/QrnHKXqWC5
— Kishan 🦅 (@Kishan_Janasena) March 29, 2025