మొత్తం అన్నీ ఫిరంగులూ చైనా వైపే ఎక్కుపెట్టి ఉన్నాయి .. ఏం జరగబోతోంది

-

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. దీని కారణంగా తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని అమెరికాతో పాటు చాలా దేశాలు ఆరోపిస్తున్నాయి.  అగ్రరాజ్యం అమెరికాతో పాటు యునైటెడ్ కింగ్డం (యూకే), ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.China's aggressive diplomacy weakens Xi Jinping's global standing ...ఈ క్రమంలో జర్మనీ కూడా చైనాను విమర్శిస్తూ తాము నష్టపోయిన దానికి పరిహారంగా 130 బలియన్స్ చెల్లించాలని  ఏకంగా చైనాకు లేఖ రాసింది. దీనిపై చైనా స్పందిస్తూ జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి చేస్తున్న వ్యాఖ్యలని బదులిచ్చింది. అయితే కరోనా కారణంగా చైనా పై పెంచుకున్న ద్వేషంతో ప్రపంచ దేశాలు చైనాపై  భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటాయో అని ఆర్థిక నిపుణులు విశ్లేషలు చేస్తున్నారు. చైనా వ్యాపారం మొత్తం ఇతర దేశాలపైనే ఆధారపడి ఉంది. ట్రేడ్ రిలేషన్ షిప్ పై ప్రపంచ దేశాలు ఏమైనా షరతులు విధిస్తాయా? లేక చైనా ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ను పూర్తిగా ఆపేస్తారని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు.
ఒక విపత్తును ఒక దేశం మీదికి నెట్టడం సరైన నిర్ణయం కాదని, ఇలాంటి సందర్భంలో అందరి కలిసి కట్టుగా పోరాడాలని వైద్య నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చైనాను నిందించడం మానేసి, వ్యాధిని నివారించడానికి మార్గాలు వేతకాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version