నేడు ఆల్ పార్టీ మీట్… రైతు బిల్లుపైనే ప్రధాన చర్చ

-

పార్లమెంట్ సమావేశాలకు ఒక రోజు ముందు నేడు కేంద్రం ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీట్ జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా హజరవ్వనున్నారు. ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు కూడా హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే అన్ని బిల్లుల గురించి అన్ని పార్టీలకు తెలియజేయనుంది. రైతులకు పరిహారం, ఎంఎస్‌పి,ద్రవ్యోల్బణం అంశాలపై సభలో చర్చకు ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే అన్నింటి కన్నా ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు పైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు అంటే సోమవారం లోక్‌సభ కార్యకలాపాల జాబితాలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును చేర్చారు. మూడు చట్టాలను రద్దుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత ఇటీవల కేంద్ర మంత్రివర్గం కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును దిగువ సభలో ప్రవేశపెట్టనున్నారు. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌లు తమ ఎంపీలకు సోమవారం సభకు హాజరు కావాలని కోరుతూ విప్‌లు జారీ చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version