Breaking : ఓయూ విద్యార్థులకు అలర్ట్‌.. పరీక్షలు వాయిదా..

-

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించాల్సినప్పటికీ, వివిధ కారణాల రీత్యా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు తమ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఆధాకారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం జేఎన్‌టీయూహెచ్‌లో ఎంసెట్‌ కమిటీ సమావేశం జరిగింది. అయితే.. ఈ సమావేశంలోనే ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ ఏడాది జులై 18 నుంచి 21 వరకు జరిగిన తెలంగాణ ఎంసెట్‌ 2022 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 1.56 లక్షలు, అలాగే జులై 30, 31 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 80 వేల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్‌ కీని కూడా ఇప్పటికే విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version