తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ చాలా సామరస్య వాతావరణంలో జరిగింది. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓటింగ్ లో ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీలు.
ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ అయితే రెండు అసెంబ్లీ ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని స్థాపించి పార్లమెంటు ఎన్నికలలో ఆశించిన స్థాయిలో రాకపోవడంతో తాజాగా జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
అన్ని రాజకీయ పార్టీలు ఒకరిని మించి మరొకరు ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో రకరకాల హామీలను మేనిఫెస్టో రూపంలో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు అదేవిధంగా 19 కార్పొరేషన్ల కు గాను జరిగిన ఈ ఎన్నికలలో ప్రజలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే జరిగిన ఓటింగ్ శాతం ప్రకారం సర్వేల ప్రకారం లెక్కలు చూస్తే అధికార పార్టీ టిఆర్ఎస్ వైపు తెలంగాణ ప్రజలు మొగ్గు చూపారని అన్ని సర్వేలలో ఇదే షాకింగ్ నిజం బయటపడటంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.