ఎన్నికలకు మరో వారం రోజులు సమయం మాత్రం ఉండడంతో ఆయా పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. ఇప్పటికే పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ కూటమి పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఈ ఎన్నికల్లో చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…’ఈసారి పేదల శత్రువులంతా ఒక్కటయ్యారు అని విమర్శించారు. పొరపాటున బాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపే. ఎన్నికలు వచ్చేసరికి ఆయన దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. రూ.2 లక్షల కోట్ల డ్రగ్స్ రాష్ట్రానికి వచ్చాయన్నారు. అవి వదినమ్మ బంధువులవేనని తేలడంతో కూటమి నేతలు సైలెంట్ అయ్యారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.