పార్టీ నుంచి వెళ్లిన నేతలంతా చెట్టుకు చెదలు లాంటి వాళ్లే : జగదీష్ రెడ్డి

-

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్లగొండలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్‌ పని అయిపోయింది అనుకున్న వాళ్లందరూ ఇప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే భయపడిపోతున్నరు.జరుగుతున్న పరిణామలే బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో స్పష్టం చేస్తున్నయి అని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలు పక్క రాష్ట్రాల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తయ్ అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆ పార్టీలకు పట్టవు. అందుకే కేసీఆర్ ను ప్రజలు కోరుకుంటున్నరు అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు మోడీ సహకరించిండు. ఎంపీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నడు అని ఆరోపించారు. గత ఎన్నికల ఫలితాల్లోనూ వీరి కుమ్మక్కు రాజకీయాలు స్పష్టమయ్యాయి. మైనారిటీలను ఓట్ల కోసమే కాంగ్రెస్ వాడుకుంటుంది. రైతుబంధు ఇవాళ వచ్చిందంటే కేసీఆర్ భయమే కారణం అని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిన నేతలంతా చెట్టుకు చెదలు లాంటి వాళ్లే అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news