వామ్మో 304(బీ)… వాహనదారులూ బహు పరాక్.. 10 ఏళ్ల వరకు శిక్ష..!

-

ఒరేయ్.. ఓసారి నీ బండివ్వరా? కాసేపు అలా బయటికెళ్లి వస్తా.. అనగానే మీ ఫ్రెండ్ కో లేదంటే వేరే తెలిసిన వ్యక్తికి మీ బైక్ కానీ, కారు గానీ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లే. మీరు కూడా రోడ్డు ప్రమాద కేసుల్లో ఇరుక్కుంటారు. మామూలుగా కాదు.. 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించే ప్రమాదం ఉంది. ఎహె.. ఊరుకోండి. నేను బైక్ తోలనప్పుడు నాకెందుకు శిక్ష పడుతుంది. నేను నా బైక్ ఇచ్చా కానీ.. అది వేరే వ్యక్తి డ్రైవ్ చేస్తాడు కదా.. అంటూ దబాయించకండి.. ఈ వార్త చదవండి మీకే అర్థమవుతుంది.

ఐపీసీ సెక్షన్ 304 (ఏ), (బీ)… ఈ రెండు సెక్షన్ల గురించి వాహనం ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముందుగా.. ఐపీసీ సెక్షన్ 304 ఏ అంటే… ఏదైనా రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తి..అంటే ఆ వాహన డ్రైవర్ పై ఈ కేసును నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద దాదాపు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతవరకు బాగానే ఉంది.

కానీ.. రీసెంట్ గా ఇదే సెక్షన్ లో మరో సవరణ వచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసి 304 బీ అనే సెక్షన్ ను తీసుకొచ్చారు. ఈ ఐపీసీ సెక్షన్ ప్రకారం ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపినా.. ఆ ప్రమాదం వల్ల ఎవరి ప్రాణాలైనా పోయినా…అది హత్య కేసు కింద పరిగణించబడుతుంది. ఆ వాహనాన్ని నడిపిన డ్రైవర్ తో పాటు ఆ వాహన యజమానిపైనా కేసు నమోదు చేస్తారు.

ఈ సెక్షన్ కింద 10 ఏళ్ల వరకు శిక్ష వేస్తారు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉంటుంది. అంటే బెయిల్ త్వరగా రాదు. అంటే.. తమ వాహనాన్ని వేరే వ్యక్తి తీసుకెళ్లి యాక్సిడెంట్ చేసినా.. ఆ వాహన యజమానులు కూడా శిక్ష అనుభవించాల్సిందే. దీంతో ఇప్పుడు వాహన దారులు భయపడిపోతున్నారు. వామ్మో.. ఇదేం సెక్షన్ రా బాబు.. ఏ తప్పు చేయకున్నా జైల్లో పెట్టేటట్టున్నారని వేరే వాళ్లకు తమ వాహనం ఇవ్వడానికే జంకుతున్నారు. అయితే.. ఈ సెక్షన్ గురించి ఎంతమంది వాహనదారులకు తెలుసు అనేదే ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version