కరోనా నివారణ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధం: ఆళ్ల నాని

-

కడప జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్ లో మంత్రి ఆళ్లనాని సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హరికిరణ్ సమక్షంలో జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. జిల్లాలోని కొవిడ్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తులతో మంత్రి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు.

alla nani
alla nani

రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనన్న మంత్రి ఆళ్లనాని… వారికి కావాల్సిన ఆసుపత్రులు, మందులు, వైద్య సదుపాయాలు సమకూరుస్తున్నామని చెప్పారు. కడప జిల్లాలో రోజుకు సగటున 4 వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి… జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1080 ఆక్సిజన్ బెడ్లకు అదనంగా మరో 300 బెడ్లు పెంచుతున్నామన్నారు. వారం రోజుల్లో జిల్లా కొవిడ్ కేర్ ఆసుపత్రుల్లో పని చేయడానికి కావాల్సిన వెయ్యిమంది వైద్యులు, నర్సులు, సిబ్బందిని నియమిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. పాజిటివ్ వచ్చినవారు భయపడొద్దని… ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆళ్ల నాని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news