రేప్ చేసారని ఆరోపణ, ఆత్మహత్య చేసుకున్న బాలిక, అసలు ఏం జరిగింది…?

-

ఛత్తీస్‌గడ్ లోని కొండగావ్ జిల్లాలో దారుణం జరిగింది. ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతో జూలై 20 న మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల తరువాత స్థానిక పోలీసులు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. బాధితుడి తండ్రి ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాతే పోలీసులు ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. పొరుగున ఉన్న గ్రామంలో జరిగే వివాహానికి హాజరు కావడానికి బాలిక వెళ్ళింది అని, సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెను గంటల పాటు అత్యాచారం చేసారు.

బస్తర్ రేంజ్ ఐజి పి సుందర్‌రాజ్ ఒక మీడియా ఛానల్ కి వివరాలు చెప్పారు. “ప్రాథమిక సమాచారం ప్రకారం, అమ్మాయి ఒక పొరుగు గ్రామంలో బంధువుల వివాహానికి హాజరు కావడానికి వెళ్ళినప్పుడు ఆమెను ఇద్దరు తాగుబోతులు సమీపంలోని అడవికి తీసుకువెళ్లారు. అక్కడ మరో ఐదుగురు వారితో కలిసి ఆమెపై చాలా గంటలు అత్యాచారం చేసారని వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేప్ గురించి ఎవరికి అయినా చెప్తే తనను చంపేస్తానని రేపిస్టులు బెదిరించారని ఆమె తరువాత ఒక స్నేహితుడికి చెప్పింది.

“రేపిస్టులు ఆమెను తిరిగి వివాహ వేదికకు తీసుకువచ్చినప్పుడు ఆమె నిశ్శబ్దంగా ఉంది. ఆమె తన తల్లిదండ్రులకు ఏమీ చెప్పకుండా, తిరిగి తన గ్రామానికి తిరిగి వచ్చింది అని ఐజి చెప్పారు. జూలై 20 న ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది అని వివరించారు. ఆమె ఆత్మహత్యపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారని, ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం తెలిస్తే వారిని సంప్రదించమని కుటుంబ సభ్యులను పోలీసులు కోరినట్లు ఐజి తెలిపారు. “చాలా రోజుల తరువాత, అమ్మాయి స్నేహితుడు గ్యాంగ్ రేప్ గురించి కుటుంబ సభ్యులకు చెప్పాడని అన్నారు.

వారు ఆశ్చర్యపోయారన్నారు. కానీ ఆమె అప్పటికే చనిపోవడంతో ఈ కేసులో ముందుకు వెళ్ళాలా వద్దా అనేది వారికి తెలియలేదు అని, చట్టం గురించి వారికి అవగాహన లేదు అని అక్కడి నుంచి పోలీసుల వద్దకు రాలేదు అని చెప్పారు. రెండు నెలల తరువాత, ఆమె తండ్రి కూడా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసాడని అప్పుడు కేసు నమోదు చేసామని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్‌పర్సన్ యశ్వంత్ జైన్ కూడా కొండగావ్ ఎస్పీకి లేఖ రాశారు. 10 రోజుల్లోగా సమగ్ర దర్యాప్తు నివేదికను కమిషన్ కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news