హత్రాస్ బాధితురాలి కుటుంబానికి 24 గంటల హైసెక్యూరిటీ

-

యూపీలో దమనకాండకు బలయిన హత్రాస్ బాధితురాలి కుటుంబానికి యోగి ఆదిత్యనాద్ సర్కార్ హై సెక్యూరిటీ కల్పించింది. 24 గంటల సెక్యూరిటీతో పాటు ఇంటి బయట సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అలానే వారి వ్యక్తిగత భద్రత కోసం ఆరుగురు మహిళా పోలీసులను నియమించారు. అంతే కాక గ్రామంలో కొత్తగా మరో ఇద్దరు ఇన్స్ పెక్టర్లను, సబ్ ఇన్స్ పెక్టర్లను, పోలీసులను నియమించారు.

అలానే మరో పక్క హత్రాస్ పూర్ రేప్ కేసు విచారణకు యోగి సర్కార్ నియమించిన సిట్‌ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ దర్యాప్తు నివేదిక ఇచ్చేందుకు మరో 10 రోజులు గడువు ఇచ్చింది. హోం శాఖ కార్యదర్శి భగవాన్‌ స్వరూప్‌ నేతృత్వంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని యూపీ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఇక సిట్‌కు మరో 10 రోజులు గడువిచ్చినట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్‌కుమార్‌ అవస్థి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news