మంత్రులకు శాఖలు కేటాయింపు… మళ్లీ అమిత్ షాకే హోంశాఖ

-

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. ప్రధాని మోడీతో పాటు మరో 72 మంది కేంద్ర మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు మొదలైంది.కేంద్ర హోంశాఖను మరోసారి అమిత్ షాకే ఇవ్వగా.. రక్షణ శాఖను మళ్లీ రాజ్ నాథ్ సింగ్‌కే కేటాయించారు. ఈ ఇద్దరు బీజేపీ అగ్రనేతలు శాఖల్లో ఎలాంటి మార్పులు జరగలేదు.గతంలో రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా పని చేసిన నితిన్ గడ్కరీకి మరోసారి అదే శాఖను కేటాయించారు. సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా, అజయ్ టమ్లా ఉండనున్నారు.

కీలకమైన విదేశాంగ శాఖను మరోసారి జై శంకర్‌కే కేటాయించారు. మోడీ కేబినెట్‌లో కీలకమైన హోం, రక్షణ, విదేశీ వ్యవహరాలు, ఆర్ధిక శాఖలను బీజేపీ వద్ద ఉంచుకుంది.

* నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ

* అశ్వినీ వైష్ణవ్ – రైల్వే శాఖ, సమాచార&ప్రసార శాఖ

* హర్దీప్ సింగ్ పూరి – పెట్రోలియం శాఖ

* పీయూష్ గోయల్ – వాణిజ్యం

* శివరాజ్సంగ్ చౌహాన్ – వ్యవసాయం

* జితన్రామ్ మాంజీ – MSME

 

* మనోహర్లాల్ ఖట్టర్ – హౌసింగ్ &అర్బన్ డెవలప్మెంట్

Read more RELATED
Recommended to you

Latest news