సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన పై ఈరోజు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. అయితే ఆ విచారణలో ఏం జరిగింది అనే విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. విచారణలో భాగంగా అల్లు అర్జున్ కు సంధ్య థియేటర్ వీడియోలు చూపించగా.. అతను మోషనల్ అయినట్లు తెలుస్తుంది. మొత్తం మూడు గంటల 35 నిమిషాలు అల్లు అర్జున్ ని పోలీసులు విచారించారు.
అందులో సంధ్య థియెటర్ ఘటన పై పోలీసులు తయారు చేసిన వీడియో చూసి అల్లు అర్జున్ కొంత భావొద్వేగానికి గురయ్యాడు. ఇక ఈరోజు బన్నీని పోలీసులు 18 ప్రశ్నలు అడగగా.. 15 ప్రశ్నలకు సమాధానం చెప్పిన అల్లు అర్జున్.. 3 ప్రశ్నలకు తెలియదు అని థియేటర్ లోపల చీకటి గా ఉన్ననందున అర్ధం కాలేదు అని సమాధానం ఇచ్చాడు. ఇక తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు ఒప్పుకున్న అల్లు అర్జున్.. మళ్ళీ విచారణ పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని చెప్పాడు. అయితే ఈ పూర్తి విచారణను వీడియో రికార్డ్ చేసారు పోలీసులు. ఈ విచారణ సమయంలో కేవలం మూడు సార్లు వాటర్ తాగిన అల్లు అర్జున్.. తను కార్ లో ఉన్న బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్ తిని టీ తాగినట్లు తెలుస్తుంది.