మెగా ఫ్యాన్స్‌కు బ‌న్నీ దూర‌మైన‌ట్టే..

-

మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవంటూ చెప్పుకునే మెగా హీరోల మధ్య వివాదం రేగుతుందన్న విషయం ఇప్పటికే రెండు మూడు సార్లు బహిర్గతమైంది. ఈ వివాదాలు అన్నింటికి స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ కేంద్ర‌బిందువుగా మారుతున్నాడు. గ‌తంలో రుద్ర‌మ‌దేవి సినిమా టైంలో ప్రేక్ష‌కులు బ‌న్నీ మాట్లాడుతుండ‌గా ప‌వ‌న్ గురించి మాట్లాడాల‌ని కేక‌లు వేయ‌గా… తాను ప‌వ‌న్ గురించి మాట్లాడ‌న‌ని చాలా అస‌హ‌నంగా వారిపై ఫైర్ అయ్యాడు.

ఆ త‌ర్వాత ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో సైతం బ‌న్నీ ప‌వ‌న్ విష‌యంలో ఇదే యాట్యిట్యూడ్‌తో వ్య‌వ‌హ‌రించ‌డంతో బ‌న్నీని ప‌వ‌న్ ఫ్యాన్స్ బాగా టార్గెట్ చేశారు. బ‌న్నీ ప‌వ‌న్ గురించి చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అన‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ర‌గిలిపోయారు. చివ‌ర‌కు ఇది త‌న సినిమాల క‌లెక్ష‌న్ల విష‌యంలో ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని గ్ర‌హించిన బ‌న్నీ ప‌వ‌న్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మని మొక్కుబ‌డి ప్ర‌క‌ట‌న చేశాడు. ఇక రంగ‌స్థ‌లంకు ముందు వ‌ర‌కు చ‌ర‌ణ్ కంటే బ‌న్నీ మార్కెట్ ఎక్కువ‌.

చెర్రీకి ధృవ‌, రంగ‌స్థ‌లం లాంటి వ‌రుస హిట్లు… అటు బ‌న్నీకి వ‌రుస ప్లాపులు ప‌డ‌డంతో ఇప్పుడు బ‌న్నీ డౌన్ అయ్యాడు. ఇక కొద్ది రోజులుగా మెగా ఫాన్స్ అన్న బ్రాండ్ నుండి .. అల్లు అర్జున్ బయటపడి సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని చూస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విష‌యంలో మెగా హీరోలంద‌రితో పాటు మిగిలిన హీరోలు సైతం స్పందిస్తున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రి రిలీజ్‌ వేడుకకు మెగా హీరోలందరూ వచ్చారు .. కానీ బన్నీ మాత్రం రాలేదు. కావాలనే బన్నీ ఈ వేడుకకు డుమ్మా కొట్టాడంటూ మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇక బ‌న్నీ తీరుతో హ‌ర్ట్ అయిన సైరా నిర్మాత చెర్రీ ఈ వేడుక‌కు బ‌న్నీని ఆహ్వానించ‌లేద‌ని కూడా  మరో టాక్. సైరా సినిమా తెలుగు జాతి గ‌ర్వించే సినిమా.. ఈ సినిమాపై మెగా కాంపౌండ్‌లో లేని హీరోలు సైతం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. బ‌న్నీ మాత్రం దీనిపై సోష‌ల్ మీడియాలో ఏ మాత్రం పాజిటివ్‌గా స్పందించ‌డం లేదు. దాంతో మెగా అభిమానులు బన్నీ పై రకరకాల కామెంట్స్ చేస్తుంటే .. అటు అల్లు అర్జున్ అభిమానులు.. కూడా దాన్ని తిప్పికొడుతూ నానా రచ్చ చేస్తున్నారు. బ‌న్నీకి సొంతంగా ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఈ ప‌రిస్థితి చూస్తుంటే మిగిలిన మెగా అభిమానుల‌కు అత‌డు దూర‌మ‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version