కార్డులెస్ ‘క్రిడెట్ కార్డు’ వ‌చ్చేసింది

-

హైదరాబాద్‌ కేంద్రం గా పనిచేస్తున్న విరించి గ్రూపు దేశంలోనే మొట్ట మొదటిసారిగా యాప్‌ ఆధారిత క్రెడిట్‌ కార్డ్‌ సేవలను ఆవిష్కరిం చింది. ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ విత్త సంస్థ ఆర్‌బీఎల్‌ సౌజన్యంతో వి-కార్డ్‌ పేరిట ఈ సేవలను విరించి అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డు క్రెడిట్ కార్డు అందించే అన్ని సేవలు అందిస్తుంది. కానీ ఆ కార్డు ఎక్కడా కన్పించదు. కానీ సేవలు మాత్రం అన్ని ఉంటాయి. అయితే మొబైల్ యాప్ ద్వారానే ఈ సేవలు అందించనుంది. ఇది పేపర్ లెస్ క్రెడిట్ కార్డుగా నిలవనుంది.

ఫోన్లలో ఎలాంటి సంప్రదింపులు చేయాల్సిన అవసరం లేకుండా చాట్ ఆధారిత సేవలు అందించనుంది. ఆర్ బీ ఎల్ బ్యాంక్ తో టై ఆఫ్ పెట్టుకొని సామాన్యులకు క్రెడిట్ సేవలు అందించడమే ప్రధాన ద్యేయంగా బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెడుతొంది వీకార్డు. దేశ వ్యాప్తంగా దాదాపు 47 నగరాలలో వర్చువల్‌ క్రెడిట్‌ కార్డు సేవలు శనివారం నుంచే అందుబాటులోకి వచ్చినట్టుగా విరించి న్యూబిజినెస్‌ విభాగం గ్రూపు అధినేత విశాల్‌ రాజన్‌ తెలిపారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆన్‌లైన్‌ ద్వారా క్రెడిట్‌ కార్డు సేవలు అందుకొనేలా ఈ క్రెడిట్‌ కార్డ్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు.

అలాగే కనీస సంపాదన ఉన్న వ్యక్తులకు యాప్ ద్వారా రుణాలు మంజూరు చేస్తారు….ఆ రుణాన్ని మనం అన్ని అవసరాలకు వాడుకోవచ్చు. 30 రోజుల తరువాత వాడుకున్న మొత్తన్ని కట్టేస్తే సరిపోతుంది. వీకార్డు యాస్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీ వివరాలు పొందుపరిస్తే మీకు ఎంత వరకు రుణం మంజూరు చేస్తారు 2 నిమిషాల్లో చెప్పేస్తారు ఆ మొత్తం మీ యాప్ లో యాడ్ అవుతుంది దాన్ని మీరు సాదారణ కార్డు లాగే అన్ని అవసరాలకు వాడుకోవచ్చు అన్నారు వీకార్డు సీఈఓ విశాల్ రాజన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version