Allu Arjun: అందులోనూ త‌గ్గేదేలే అంటున్న బ‌న్నీ!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆయ‌నకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. వరుసగా భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ఏమాత్రం వీలున్నా త‌న బ్రాండ్ వేల్యూను పెంచుకునేలా ప్ర‌య‌త్నం చేస్తున్నాడు బ‌న్నీ. ఇప్పటికే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అల్లు అర్జున్. తాజాగా ఆయ‌న ఖాతాలో మరో బ్రాండ్ చేరింది. ఆ యాడ్ ఏంటీ? ఆ బ్రాండ్ ఏంటీ అనుకుంటున్నారా?

వివ‌రాల్లోకెళ్తే.. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో విద్యారంగంలో శ్రీచైతన్య విద్యాసంస్థకు భారీస్థాయిలో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే. దాదాపుగా 36 సంవత్సరాలుగా విజ‌య‌ప‌థంలో సాగుతున్నాయి ప్ర‌ముఖ విద్యా సంస్థలు శ్రీ చైత‌న్య. ఇప్పుడూ ఈ కార్పొరేట్ విద్యాసంస్థను ప్రస్తుతం బన్నీ ప్రమోట్ చేస్తున్నారు. శ్రీ చైత‌న్య‌కు సంబంధించిన క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో న‌టించారు.

ఐఐటీ సక్సెస్ కొరకు శ్రీచైతన్య బెస్ట్ .. ‘సక్సెస్ కొరకు శ్రీ చైతన్యను ఎంచుకోవడంలో తగ్గేదేలే’ అంటూ బన్నీ శ్రీచైతన్య సంస్థల యాడ్ లో క‌నిపిస్తున్నారు. బన్నీ ప్రమోషన్స్ వల్ల ఈ విద్యాసంస్థకు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఈ యాడ్‌ను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ లో అధికంగా క‌మ‌ర్షియ‌ల్ యాడ్ చేసిన హీరోల వ‌రుస‌లో ప్రిన్స్ మ‌హేష్ బాబు ఉన్నాడు. ఆ త‌రువాత బ‌న్నీనే.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈ ఏడాది డిసెంబర్ లో బన్నీ నటించిన పుష్ప పార్ట్1 థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో బ‌న్నీకి జోడీగా రష్మిక నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.