Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా యాక్షన్ డ్రామా నేపథ్యంలో రెండు పార్టులుగా రాబోతుంది పుష్ప. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే మాస్ హీరో ఇమేజ్ ఉన్న బన్నీ.. ఈ సినిమాతో ఊర మాస్ హీరోగా కనిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో అగ్రహీరోలంతా తమ నెక్ట్స్ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇప్పటిదాకా సమాచారం లేదు. పుష్ఫ 2 తర్వతే.. కొత్త సినిమా కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని భావించారు.
కానీ.. ఇంతలో బన్నీ ఫ్యాన్స్ కు ఊపునిచ్చే వార్త వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ కొత్త సినిమా వార్త.. వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. బన్నీ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా రాబోతున్నరట. బోయపాటి చెప్పిన కథని బన్నీ ఓకే చేశారని, ‘పుష్ప’ తర్వాత ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే నిర్మించబోతున్నామని తెలిపారు. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అప్‌డేట్ రావడంతో బన్నీ అభిమానులు ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన త్వరలోన అధికారిక ప్రకటన ఉండబోతుందట.
బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్లో 2016లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సరైనోడు ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రేజీ కాంబినేషన్
మరో సారి రీపిట్ అవుతుందటంతో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్నాడు .