రాత్రి గెలిచాం, పొద్దున్నే ఓడిపోయాం.. అంతా దుర్గమ్మకే తెలియాలి : నటి హేమ

మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికలు రెండు రోజుల కిందనే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ,.అసోషియేషన్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. విష్ణు ప్యానెల్‌ దౌర్జన్యానికి పాల్పడి.. మా ఎన్నికల్లో గెలిచిందంటూ… ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదవులకు కూడా రాజీనామా చేశారు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు.

అయితే..ఇది ఇలా ఉండగా.. ఇంద్ర కీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకున్న నటి హేమ… మా అర్టిస్ట్‌ అషోషియేషన్‌ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని… దసరా లో ప్రతీ ఏటా అమ్మవారిని దర్శిం చు కుంటానని చెప్పారు హేమ. కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నానని.. మా ఎలక్షన్స్ లో రాత్రి గెలిచాము ఉదయం ఓడిపోయాము..ఏం జరిగిందో ఆ అమ్మ వారికే తెలియాలంటూ నటి హేమ పేర్కొన్నారు. అసలు మా ఎన్నికల్లో ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి ఉందంటూ వ్యాఖ్యానించారు.