అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న అల్లు అర్జున్.. ఆ హిట్ మూవీ రీ రిలీజ్ కు సన్నాహాలు..

-

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ కూడా రెడీ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం హల్చల్ చేస్తుంది. పుష్ప మూవీ విడుదలై ఏడాది కావస్తున్న సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది..

అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రేజ్ తో ఆయన పాన్ ఇండియా మూవీను తెలుగులో రీ రిలీజ్ చేయడం పెద్ద విశేషం కాదు. కానీ ఈ సినిమా కేరళలో మళ్లీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. ఒక డబ్బింగ్ సినిమాను ఇంత భారీ ఎత్తున రీ రిలీజ్ చేయటం నిజంగానే అరుదైన విషయమే చెప్పాలి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎవరికీ దక్కని ఘనతను సంపాదించుకున్నాడనే టాక్.. అలాగే ఓ డబ్బింగ్ చిత్రం కేరళలో రిలీజ్ అయ్యి అంతటి వసూళ్ల సాధించడం మామూలు విషయం కాదు.. అలాంటిది మళ్లీ అక్కడ రిలీజ్ అవుతుందంటే నిజంగా విశేషం అనే చెప్పొచ్చు.. ఇందులో మలయాళ స్టార్ పాహద్ ఫాసిల్ ఉండటం ఆ సినిమా అక్కడ మళ్లీ రిలీజ్ అవ్వటం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా కనిపించింది.. అయితే ఇప్పటికే పుష్ప 2 మూవీ పైన విపరీతంగా హైప్ క్రియేట్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమాను దాదాపు 25 భాషల్లో.. పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ చేయనున్నట్టు అల్లు అర్జున్ తెలిపిన సంగతి తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version