టీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను బీజేపీలో చేరమన్నారని..వారి అనుబంధ సంస్థలు అడిగారని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత.నన్ను పార్టీలో చేరమని బిజెపి వైపు నుంచి ప్రతిపాదనలు వచ్చాయని.. అందుకు వాళ్లు షిండే మాడల్ ను ప్రతిపాదించారని తెలిపారు. నేను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని కుండ బద్దలు కొట్టి చెప్పారు కవిత.
పసుపు రైతులు అరవింద్ పై చీటింగ్ కేసులు పెడతారని.. అరవింద్ ఫేక్ సర్టిఫికెట్ల పై పిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అరవింద్ బురద లాంటి వాడని.. అరవింద్ నా గురించి ఇంకో సారి మాట్లాడితే…నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతాని వార్నింగ్ ఇచ్చారు. అరవింద్ ను మెత్తగా తంతామని.. అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఒడిస్తానని సవాల్ చేశారు. ఇంతా పరుషంగా నేను నా రాజకీయ జీవితంలో మాట్లాడలేదు… నేను ఆవేదన తో ఇలా మాట్లాడతున్న, నేను కర్గే తో మాట్లాడలేదని వెల్లడించారు. లైన్ దాటితే కొట్టి సంపుతామని వార్నింగ్ ఇచ్చారు.