నెటిజన్ కోరిక తీర్చిన అల్లు స్నేహ..!!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంత ప్రత్యేకమైన గుర్తింపు వుందో.. ఆయన భార్య అల్లు స్నేహారెడ్డికి కూడా అంతే గుర్తింపు ఉంది. ఇక ఎన్నో ఉన్నత చదువులు చదివిన ఈమె బన్నీని ప్రేమించి మరీ వివాహం చేసుకోవడంతో అప్పట్లో కుటుంబంలో గొడవలైనాఆ తర్వాత కుటుంబ సభ్యులను మెప్పించి మరి వివాహం చేసుకోవడం జరిగింది. ఇక నాటి నుంచి నేటి వరకు అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పవచ్చు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ జంటకు ఎప్పటికప్పుడు అభిమానులు కూడా పెరిగిపోతున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే వారి కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అల్లు అర్జున్ సినిమాలతో బిజినెస్ లతో దూసుకుపోతుంటే.. అల్లు స్నేహ రెడ్డి మాత్రం కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు ఎంతో చక్కగా నిర్వర్తిస్తోంది. ముఖ్యంగా పిల్లల బాధ్యతలు తీసుకుంటూనే మరోపక్క వారు చేసే అల్లరి వీడియోలను సోషల్ మీడియాతో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో ముచ్చటించిన అల్లు స్నేహారెడ్డి ఎన్నో విషయాలను కూడా పంచుకుంది. అంతేకాదు నేటిజన్ లు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం ఇచ్చింది.ఇక ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ మీ గ్యాలరీలో మీకు అత్యంత ఇష్టమైన ఫోటో ఏది అని ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ తన గ్యాలరీలో ఉన్న తనకి ఎంతో ఇష్టమైన ఫోటోని కూడా షేర్ చేసి నెటిజన్ కోరిక తీర్చింది. ఇక ఆఫ్రికా పర్యటన వెళ్ళిన సమయంలో తన భర్త ,కూతురు, కొడుకుతో కలిసి దిగిన ఫోటో తనకు చాలా ఇష్టమని ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఆ ఫోటోని షేర్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెకేషన్ కు వెళ్లలేదని.. వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే సమయాన్ని గడుపుతూ ఉండడంతో ఇలా అభిమానులతో ముచ్చటించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version