మంగ్లీ లిస్ట్ లో మరో హిట్ సాంగ్.. రచ్చ రచ్చే !

వీ6 ఛానల్‌లో తీన్మార్ వార్తలతో ప్రేక్షకులకు పరిచయమైన మాటకారి మంగ్లీ. ఇప్పుడు తెలంగాణలోనే మోస్ట్ పాపులర్ సింగర్ అయిపోయింది. ఈమె పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణ జానపద గాయనిగా పలు పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ తనదైన స్వరం, తెలంగాణ యాసతో అన్ని పండుగలకు ప్రత్యేక పాటలు పాడి భేష్ అనిపించుకుంటోంది. అందుకే ఆమెకు వరుసగా సినిమా పాటలు పాడే అవకాశాలు కూడా వస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఒక పాట పాడింది. రంభ ఊర్వశి మేనక అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పుడు రచ్చ రేపుతోంది. ఇక ఈ సాంగ్ కోసం బిగ్ బాస్ ఫేం మోనాల్ గజ్జర్ కాలు కదిపింది. ఒక పక్క మంగ్లీ సాంగ్ కు మోనాల్ డ్యాన్స్ రచ్చ రేపిందనే చెప్పాలి. ఇక ఈ  సాంగ్ లో సోనూ సూద్ కూడా డాన్స్ చేయడం విశేషం. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వినేయండి మరి..