కలలో ఇవి కనిపిస్తే చెడు తప్పదా…?

సహజంగా మనకి అనేక కలలు వస్తూ ఉంటాయి. కల లో ఎదో ఒకటి కనపడుతూనే ఉంటుంది. అయితే కలలో కనిపించే వాటికి నిజ జీవితం లో ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుసుకోండి. మీ కల లో కనుక నూనె తాగినట్లు కలవస్తే తీపి వ్యాధి వస్తుందని సూచన. అలాగే గాలిలో ఎగిరినట్లు కల వస్తే ఆస్తినష్టం కలుగుతుంది. అదే మీకు చంద్ర సూర్య గ్రహణాలు వచ్చినట్లు కలవస్తే కంటి వ్యాధులు వస్తాయి. అలానే ఎర్రని పూల దండలూ, వస్త్రాలలో స్త్రీ పురుషుల కానవస్తే రక్త సంబంధిత రోగాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

ఇది ఇలా ఉండగా భూత ప్రేత పిశాచులు కనుక మీ కలలో కనిపిస్తే జ్వరం వస్తుందని సూచన. అదే దేవతలూ, గోవులూ, అగ్ని, సరస్సులు, కన్యలు, ఫలములు, పర్వతాలు, నదులు సముద్రాలు దాటటం వంటివన్నీ ధనాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే సూచికలు. ఇక దున్నపోతులు, శునకాలు, గాడిదలు కనుక మీ కల లో దక్షణ దిక్కుకు వెళ్తున్నట్లు కలవస్తే.. ఊపిరితత్తుల సంబంధిత వ్యాధులు వస్తాయి.

అదే రాక్షసులు, నీటికి సంబంధించిన కలలు కనుక మీకు వస్తే.. పిచ్చిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అని. భయంకరమైనవి, నల్లనిధి కలలోకి వస్తే ఎంతో జాగ్రత్తగా వుండాలని హెచ్చరించినట్లు అవుతుంది. అదే మీకు శవాన్ని చూసినట్లు కల వస్తే కష్టాలు మీ జీవితం లో ఎదురు అవుతున్నాయి అని సూచికలు.