కరోనా దెబ్బకు ఇప్పుడు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో మన దేశంలో అన్ని కూడా మూత పడ్డాయి. మద్యం షాపులను కూడా మూసి వేసారు. దీనితో చాలా మంది మద్యం దొరకక ఇప్పుడు నరకయాతన అనుభవిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం దెబ్బకు మానసిక రోగులు బయటకు వస్తున్నారు. దీనితో ఇప్పుడు ప్రభుత్వాలకు ఇది పెద్ద తల నొప్పిగా మారింది.
ఈ తరుణంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దెబ్బకు మానసిక అనారోగ్యులు పెరగకుండా చూస్తుంది కేరళ. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులతో ముఖ్యమంత్రి పినరై విజయన్ మాట్లాడారు. మానసిక రోగుల జాబితాను సిద్దం చెయ్యాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఎవరు అయితే ఇప్పుడు మందు దొరకక ఇబ్బంది పడుతున్నారో వారిని గుర్తించాలని సూచించారు.
వారు అందరికి ఆన్లైన్ లో మద్యం సరఫరా చెయ్యాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. మద్యం దొరకక మానిసిక రోగులు పెరిగితే అసలుకే మోసం వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించాలని ఆయన అధికారులకు సూచించారు. డాక్టర్ వద్ద నుంచి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోవాల్సి ఉంటుందని, అది సరిగా ఉన్న వాళ్లకు మద్యం ఆన్లైన్ లో సరఫరా చెయ్యాలని విజయన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.