వాహనదారులకు షాక్.. ఇక నుంచి ఆ వాహనాలకే హైదరాబాద్ లో తిరుగేందుకు అనుమతి !

-

హైదరాబాద్ వాహనదారులకు షాక్ తగలనుంది. జంట నగరాల్లో ట్రాఫిక్ లో భారీ మార్పులకు రంగం సిద్ధం చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. జంట నగర ట్రాఫిక్ పోలీసులతో పాటు మున్సిపల్ ఆర్టీఏ అధికారులు కీలక సమావేశం నిన్న జరిగింది. జంట నగరాల్లో రిజిస్టర్ అయిన ఓలో ఆటోలు మాత్రమే తిరగాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

ఆర్టిఏ రిజిస్ట్రేషన్ సీరీస్ 9 నుంచి 12 వరకు ఓలా ఆటో హైదరాబాద్ తిరిగేందుకు అనుమతి ఇచ్చారు అధికారులు. ఇక వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఒలో ఆటో లు తిరగడానికి అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు అధికారులు. జంట నగరాల్లో స్పీడ్ లిమిట్ ని ఫిక్స్ చేసేందుకు సమావేశం నిర్వహించిన అధికారులు… మెయిన్ రోడ్స్ బై లైన్స్ లో ఎంత మేరకు స్పీడ్ లిమిట్ ఉండాలన్న దానిపై నిన్న కీలక సమావేశం నిర్వహించారు. ఇక టూ వీలర్స్, కార్లు, ఆటోలకు రోడ్డుపై స్పీడ్ లిమిట్ ను ఫిక్స్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news