మంచివాడైతే విడాకులు దేనికి అమ‌ల‌?

-

త‌మిళ్ ద‌ర్శ‌కుడు ఏ.ఎల్ విజ‌య్- న‌టి అమ‌లాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన సంగ‌తి  తెలిసిందే. ఈ మ‌ధ్య‌నే మ‌ళ్లీ విజ‌య్ రెండ‌వ పెళ్లి చేసుకున్నాడు. ఈ క‌ర్యాక్ర‌మం కేవ‌లం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో సింపుల్ గా జ‌రిగింది. దీంతో విజ‌య్ కు అభిమానులు, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ నేప‌థ్యంలో మాజీ భార్య అమ‌లాపాల్ కూడా శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఆమె విజ‌య్ ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. విజ‌య్ మంచి వ్య‌క్తి. కొన్నాళ్ల పాటు ఆయ‌న‌తో క‌లిసి ఉన్నాను కాబ‌ట్టి ఆయ‌న ఎలాంటి వారో నాకు తెలుసు. వెరీ స్వీట్ ప‌ర్స‌న్. ఓపిక స‌హ‌నం ఎక్కువ‌. ఆయ‌న వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటూ తెలిపింది.

amala paul sensational comments ex husband

అలాగే విడాకులు తీసుకున్న త‌ర్వాత సినిమా కెరీర్ ఎలా సాగుతుందోన‌ని భ‌య‌ప‌డ్డాను అన్న విష‌యాన్ని రివీల్ చేసింది. అయితే ఈ పోస్టుల‌పై కొంద‌రు నేటి జ‌నులు అమ‌లాపాల్ ను త‌ప్పు బ‌డుతున్నారు. అంత మంచి వ్య‌క్తి అని తెలిసిన‌ప్పుడు ఎందుకు విడిపోయావు? ప‌్రేమ వేరు?  పెళ్లైన త‌ర్వాత జీవితం వేరు అనుకున్నావా? అంటూ ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. వీటికి మాత్రం అమ‌ల నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అలాగే మంచి వాడు అంటున్నావ్?  ఏ ర‌కంగా మంచి వాడు! నీకు వ‌చ్చే అవ‌కాశాలకు అడ్డు త‌గ‌ల‌లేద‌ని ఆ మాట అంటున్నావా? అని మండి ప‌డుతున్నారు.

కాగా అమ‌ల విడాకులు తీసుకున్న స‌మ‌యంలో ఆమెదే త‌ప్పు అన్న‌ట్లు మీడియా ఎక్కువ‌గా హైలైట్ చేసింది. విజ‌య్ త‌ప్పు లేక‌పోయినా..ఇష్టం లేక‌పోయినా  విడాకుల పేప‌ర్ల‌పై సంత‌కాలు  పెట్టాల్సి వ‌చ్చింద‌ని  కోలీవుడ్ మీడియాలో రెయిజ్ అయింది. కానీ విజ‌య్ గానీ, అమ‌ల‌గానీ దీనిపై ఎలాటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల విడిపోతున్నాం త‌ప్ప‌! మ‌రో రీజ‌న్ లేద‌ని స్కిప్ చేసారు. అయినా ఇప్పుడు ఎవ‌రిని నింధించి ఏం లాభం.  వాళ్లిద్ద‌రు దారులు వేరిప్పుడు. విజ‌య్ రెండ‌వ పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. అమ‌లాపాల్ మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news