అమలాపాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రేమఖైది సినిమా నుండి తెలుగు, తమిళ భాషల్లో చేసింది తక్కువ సినిమాలైనా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న భామ అమలా పాల్.
దర్శకుడు విజయ్ తో ప్రేమ పెళ్లి, రెండేళ్లు గడిచాక విడాకులు ఇదంతా కెరియర్ లో భాగమే అనుకున్న అమలా మళ్లీ సినిమాలను చేస్తూ వచ్చింది. నిజానికి 2011లో బెజవాడ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు వంటి సినిమాలలో నటించింది.
ఇకపోతే ఆ తర్వాత వరుస డిజాస్టర్ లు రావడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమయింది. ఇక ఇటీవల ఈమె చేసిన తమిళ్ సినిమా కడవర్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతేకాదు మరొక ఓటిటి ఫిలిం పిట్టకథలు కూడా చేసి ఆకట్టుకుంది. తాజాగా అమలాపాల్ షర్ట్ విప్పి.. కేవలం బ్రాలో కనిపించింది. వైట్ బ్రాలో కనిపించి అందరినీ మెస్మైరజ్ చేస్తోంది అమలాపాల్. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.