తెలంగాణ శిశు,మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు అంగన్‌వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.వేసవి నేపథ్యంలో అంగన్‌వాడీ లబ్ధిదారులైన చిన్నారులు బాలింతలు, గర్భిణీలకు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉపశమనం కల్పిస్తూ మే నెల మొత్తం ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు టీచర్స్,హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి కృతజ్ఞతలు తెలిపారు.వేసవిలో చిన్న పిల్లలు, గర్భిణులు అంగన్ వాడి సెంటర్లకు విచ్చేస్తే ఇబ్బందులు తప్పవని ఇటీవల హెల్పర్స్ యూనియన్ ఆధ్యర్యంలో చేసిన వినతికి మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన అంగన్‌వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్
వేసవి నేపథ్యంలో అంగన్‌వాడీ లబ్ధిదారులైన చిన్నారులు బాలింతలు, గర్భిణీలకు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉపశమనం కల్పిస్తూ మే నెల మొత్తం సెలవు ప్రకటన.
ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు… pic.twitter.com/VWC2odqPfP— ChotaNews App (@ChotaNewsApp) May 3, 2025