బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్‌ గుడ్‌ న్యూస్…అదిరిపోయే అప్డేట్‌ వచ్చేసిందిగా !

‘బిగ్‌బాస్‌’ పేరు వింటే.. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఎగిరిగంతేస్తారు. అంతలా పాపులర్‌ అయింది బిగ్‌బాస్‌ షో. అది మొదలైదంటే అభిమానులు ఆనందానికి అంతే ఉండదు.అన్ని భాషల్లో వస్తున్న బిగ్‌బాస్‌ షోకు ఎన్నో విమర్శలు వస్తున్న కూడా రేటింగ్‌లో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల బిగ్‌బాస్‌–4 సీజన్‌ విజయవంతంగా పూర్తయిన సంగతి విదితమే.

 

ప్రస్తుతం బిగ్‌బాస్‌ – 5 సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే.. ఈ బిగ్‌బాస్‌ – 5 సీజన్‌ ఎప్పుడూ ప్రారంభం అవుతోందనని అందరిలోనూ కొంత ఆతృత ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్‌బాస్‌ – 5 సీజన్‌ నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ మేరకు స్టార్‌ మా తాజాగా ఓ ప్రోమోను రిలీజ్‌ చేసింది. బిగ్‌బాస్‌ – 5 సీజన్‌ అతి త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఈ ప్రోమోలో పేర్కొంది స్టార్‌ మా. అయితే.. ఈ సారి గేమ్‌ ఓ పజిల్‌ లాగా ఉండబోతుందని బిగ్‌బాస్‌ – 5 సీజన్‌ లోగో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక బిగ్‌బాస్‌ – 5 సీజన్‌ ఎవరు హోస్ట్‌ మరియు కంటేస్టేంట్స్‌ ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.