తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు.. ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం అయ్యారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో హైదరాబాద్ అలాగే రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో భేటీ అయ్యారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

KCR's emergency meeting with Hyderabad leaders
ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీ బలోపేతానికి అవలంబించాల్సిన అంశాలపై నేతలతో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో కెసిఆర్ కుమారుడు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్ర రెడ్డి అలాగే మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం
- ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో భేటీ
- గ్రేటర్‌లో పార్టీ బలోపేతానికి అవలంబించాల్సిన అంశాలపై నేతలతో చర్చించిన కేసీఆర్
- హాజరైన కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి