బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ…!

-

బ్యాంక్ అకౌంట్ తెరవాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. మీరు కూడా బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పకుండ దీని కోసం తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఉచితంగానే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

 

amazon-prime

అది ఎలా అనేది చూస్తే.. ఫినో పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ఓ ఆఫర్ ని తీసుకు రావడం జరిగింది. అయితే ఎవరైనా శుభ్ సేవింగ్స్ అకౌంట్ లేదా సంప్రణ్ కరెంట్ ఖాతా ని ఓపెన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఫ్రీ గా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ని పొందొచ్చు. అది కూడా ఒక నెల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ని ఫ్రీ గా పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల వివిధ ప్రయోజనాలు పొందొచ్చు. ఫాస్ట్ డెలివరీ, వీడియోలు, మ్యూజిక్ వంటి లాభాలుంటాయి.

ఈ ఆఫర్ నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనుక అప్పటిలోగా ఈ ఖాతా తెరిస్తే ఫ్రీ గా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ని పొందొచ్చు. ఈ ఖాతా కలిగిన వారు ఏడాదికి రూ.499 చెల్లించాలి. ఇక ఈ అకౌంట్‌పై 6.25 శాతం వడ్డీ వస్తుంది. మినిమమ్ బ్యాలెన్స్ వుండాలనేం లేదు. ఈ ఖాతాని తెరిస్తే రూ.2 లక్షల వరకు ఉచిత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news