త్వరపడండి.. అమెజాన్‌లో సమ్మర్‌ సేల్‌.. కూల‌ర్లు, ఏసీలు, ఫ్రిజ్‌ల‌పై 50 శాతం డిస్కౌంట్‌..!

-

ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన సైట్‌లో సమ్మర్‌ అప్లయెన్సెస్‌ కార్నివాల్‌ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ సేల్‌ ఇప్పటికే ప్రారంభం కాగా మార్చి 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఏసీలు, ఫ్రిజ్‌లను వినియోగదారులు చాలా తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆకట్టుకునే ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు, నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాలను కూడా అందిస్తున్నారు.

అమెజాన్‌ సమ్మర్‌ అప్లయెన్సెస్‌ కార్నివాల్‌ సేల్‌లో.. అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నారు. అలాగే ప్రైమ్‌ మెంబర్లకు అదనంగా 5 శాతం ఫ్లాట్‌ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇక ఇతర ఐసీఐసీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై రూ.1500 వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో వోల్టాస్‌, ఎల్‌జీ, డైకిన్‌, వర్ల్‌పూల్‌, శాంసంగ్‌, సింఫనీ, గోద్రెజ్‌ తదితర కంపెనీలకు చెందిన ఏసీలు, ఫ్రిజ్‌లపై ఆఫర్లను అందిస్తున్నారు. ఏసీలపై గరిష్టంగా 45 శాతం వరకు తగ్గింపు ధరలను పొందవచ్చు. అలాగే రూ.23,999 ప్రారంభ ధరలకే ఇన్వర్టర్‌ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. రూ.21,999 ప్రారంభ ధరలకు స్ప్లిట్‌ ఏసీలు, రూ.17,490 ప్రారంభ ధరలకు విండో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎల్‌జీ కంపెనీకి చెందిన ఫ్రిజ్‌లపై 35 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే సింఫనీ, క్రాంప్టన్‌, బజాజ్‌, హావెల్స్‌ కూలర్లపై 50 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version