టీటీడీలో భక్తులకు కనీస సదుపాయాలు లేవు. ఆరు ప్రాణాలు కోల్పోవటం మానవ తప్పిదం అని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారు. మీరు దుర్మార్గంగా వ్యవహరించారు కాబట్టే ఈ ఘటన జరిగింది. అధికారులపై కోపాన్ని చూపించిన చంద్రబాబు ఏం సాధించారు. అధికారులను తిట్టి తనపనై పోయిందని చంద్రబాబు భావిస్తున్నాడు. కానీ ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఏడు కొండలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. సనాతన ధర్మాన్ని కాపాడే పోరాట యోధుడు ఇంతవరకు ఏం మాట్లాడలేదు. సనాతన ధర్మానను కాపాడే పెద్దలు నోరు విప్పాలి. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. క్షతగాత్రులకు 25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి. ఘటనను మసిబూసి మారేడు కాయ చేయాలని చూశారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే మృతుల ఆత్మ శాంతిస్తుంది. వైసీపీని అణిచి వేయాలని చూస్తే అగ్నిపర్వతంలాగా తయారవుతుంది అని అంబటి అన్నారు.