వైసీపీ ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం.. రైతులకు నష్టం కలిగితే ,వాళ్ళని ఆదుకోవాలని తాపత్రయపడిన ప్రభుత్వం. వ్యవసాయం దండగ కాకూడదు అని తపన పడిన ప్రభుత్వం వైసీపీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు రాగానే, ప్రమాణ స్వీకారం చేయగానే, పంటల ధరలు పడిపోయాయి. వరి ధాన్యం 1200, 1300కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు నట్టేట మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రైతులను కలిస్తే ,టిడిపి నాయకులకు మండిపోతుంది.
అందుకే జగన్ రాకుండా ఉండటానికి కుట్ర చేశారు. జగన్ రైతుని పరామర్శించాలి అనుకోవడం తప్పా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ జగన్ విద్యార్ధి పర్యటనకు వర్తించదు. మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఊరేగింపులు బహిరంగ సభలు చేసేవాళ్లు పర్మిషన్లు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఓటర్ల ఓట్లు అడగడానికి రాలేదు. రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారు. ఎన్నికలు జరిగితే పరామర్శలు చేయకూడదా.. వల్లభనేని వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు అడ్డురాని ఎన్నికల కోడ్ , రైతును పరామర్శించడానికి వెళ్తే అడ్డు వస్తుందా అని ప్రశ్నించారు అంబటి.