కేసీఆర్ సంచలన నిర్ణయం..!

-

తెలంగాణ లో మరో ప్రజా పోరాటం రాబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25వ సంవత్సరంలోకి కార్యక్రమాలపై కేసీఆర్ నేడు ఆ పార్టీ నేతలతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. కేసీఆర్ మాట్లాడుతూ ప్రజల కోసం పోరాటం చేయగల పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని.. కాంగ్రెస్ ప్రజా ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2028లో అధికారంలోకి వచ్చేది 100 శాతం తామే అని.. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వెనక్కి పయనిస్తోందని అన్నారు.

ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆరోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. పార్టీ స్థాపించి 25 కాళ్లు కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.  పార్టీలో వ్యవస్థాగత కమిటీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news