బొల్లాపల్లి రిజర్వాయర్ 150టీఎంసిలకు చేరితే వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన నల్లమల సాగర్ నీరు తరలించాలని ప్రణాళిక అని మాజీమంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నల్లమల సాగర్ నుంచి బనకచర్ల వరకు 23 కిలోమీటర్ల టన్నెల్ తవ్వి పనులు చేయాలని అంచానాలు వేశాం. గతంలో మా ప్రణాళికలు అన్నీ కార్యరూపం దాల్చితే గోదావరి నుంచి వృధాగా వెళ్ళే జలాలు కృష్ణా నదిలోకి వెళ్తాయి. ఈ అనుసంధానంతో వెనుకబడిన ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలు సస్య శ్యామలం అవుతాయి. 2022లో దీనికి సంబంధించిన డీపీఆర్ లు సిద్ధం చేసి కేంద్రానికి పంపాం. కేంద్ర అనుమతులు కోసం వేచి ఉన్నాం. ఈ ప్రణాళికలను మొత్తం ఇవాళ చంద్రబాబు అన్నీ నేనే చేసానని చెప్పుకుంటున్నారు. 85 వేల కోట్లతో చేయాల్సిన పనులు ఇవి.
అయితే మెడికల్ కాలేజ్ లు.. పోర్టులు.. ఆర్ అండ్ బీ రోడ్లు అన్నీ ప్రైవేట్ పరం చేయబోతున్న చంద్రబాబు.. తెలుగుతల్లి జలహారతి అని పేరు కూడా పెట్టారు. అన్నీ తన వారికే ఇవ్వాలని చంద్రబాబు యత్నం. అన్నింటికీ కేంద్రం సుముఖత అన్న ప్రచారం. కేంద్రమే ఇస్తే మేము ఉన్నప్పుడే చేసే వాళ్ళం కదా. ప్రచార ఆర్భాటాలు తప్ప చేస్తున్న పనులు మాత్రం లేవు. ఆఖరికి రైతులను కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తునారు చంద్రబాబు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.