బెట్టింగ్ వలలో చిక్కుకుని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర జిల్లాలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాకు చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌లకు పాల్పడి తీవ్ర అప్పుల్లో మునిగిపోయాడు.ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చాలని బెట్టింగ్ నిర్వాహకులు సదరు యువకుడిపై ఒత్తిడి తేవడంతో.. మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సదరు యువకుడు ఆత్మహత్యకు యత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
బెట్టింగ్ వలలో చిక్కుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర జిల్లాకి చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల్లో మునిగిపోయాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చాలని బెట్టింగ్ నిర్వాహకులు సదరు యువకుడిపై ఒత్తిడి తేవడంతో.. మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని… pic.twitter.com/g1RUSS381h
— ChotaNews App (@ChotaNewsApp) April 10, 2025