ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమి పాలైంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో ఓడింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజారత్ టైటాన్స్ పై చేయి సాధించింది. చెన్నై విధించిన 170 పరుగుల టార్గెట్ ను గుజరాత్ టైటాన్స్ అతి కష్టంగా చేధించింది. డేవిడ్ మిల్లర్ (51 బంతుల్లో 94 నాటౌట్) చెన్నైకి శాపంగా మారాడు.
మిల్లర్ ఇన్నింగ్స్ తో చెన్నైకి మ్యాచ్ ను దూరం చేశాడు. మిల్లర్ కు తోడుగా రషీద్ ఖాన్ (40) రాణించాడు. అయితే.. ఈ మ్యాచ్ లో అంబటి రాయుడు ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. గుజరాత్ తో మ్యాచ్ లో 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐపీఎల్ లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఐపీఎల్ లో 4 వేల పరుగులు పూర్తి చేసిన 13 ఆటగాడిగా రాయుడు నిలిచాడు. అలాగే ఈ ఘనత సాధించిన 10 వ ఇండియా ప్లేయర్ గా నిలిచాడు రాయుడు. ఇక ఐపీఎల్ లో 181 మ్యాచ్ లు ఆడిన రాయుడు.. 29 యావరేజ్ తో 4044 పరుగులు చేశాడు.