ఈ మధ్య కాలం లో చాలా మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. అలానే చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకుంటున్నారు. దీని వలన ఆర్థిక భద్రత ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడానికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోచ్చు. అలానే పాలసీ తీసుకోవడం వలన రిటైర్ అయ్యాక ఎలాంటి కూడా ఏ ఇబ్బంది ఉండదు.
టర్మ్ పాలసీ, మనీ బ్యాక్, యాన్యుటీ, హెల్త్ ఇలా పలు రకాల ప్లాన్లు వున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు రకాల పాలసీలు అందిస్తోంది. అయితే ఇందులో ఎల్‌ఐసీ జీవన్ శిరోమణి పాలసీ కూడా ఒకటి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ జీవన్ శిరోమణి నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివీజువల్, లైఫ్ అస్యూరెన్స్ సేవింగ్స్ ప్లాన్.
కనీసం రూ.కోటి మొత్తానికి పాలసీ తీసుకోవాలి. ప్రతి రూ.1000 బీమా మొత్తానికి రూ.50 గ్యారంటీ అడిషన్స్ లభిస్తుంది. తొలి ఐదేళ్లకు ఇది వర్తిస్తుంది. ఐదేళ్ల దాటితే రూ. 55 మేర పొందొచ్చు. అలానే లాయల్టీ అడిషన్స్ కూడా వస్తాయి. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ప్రీమియం చెల్లించాలి. మీకు నచ్చిన ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక దీనికి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. 18 నుంచి 67 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీలో చేరొచ్చు.
దీని టర్మ్ 14, 16, 18, 20 ఏళ్లుగా ఉంది. మీరు మీకు నచ్చిన దానిని ఎంచుకోచ్చు. కనీస ప్రీమియం చెల్లింపు టర్మ్ 4 ఏళ్లు. కనీసం రూ. కోటి బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. మాక్సిమం లిమిట్ ఏమి లేదు. పాలసీ తీసుకున్న వారు ఐదేళ్లలోపు మరణిస్తే బీమా మొత్తంతోపాటు గ్యారంటీ అడిషన్స్ చెల్లిస్తారు. ఒకవేళ ఐదేళ్ల తర్వాత, మెచ్యూరిటీ కన్నా ముందు మరణిస్తే బీమా మొత్తం, గ్యారంటీ అడిషన్స్, లాయల్టీ బోనస్ వంటివి ఉంటాయి.
14 ఏళ్ల పాలసీ అయితే బీమా మొత్తంలో 30 శాతం మొత్తాన్ని పదో ఏడాది, 12వ ఏడాది పే చెయ్యడం జరుగుతుంది. మెచ్యూరిటీ సమయంలో మిగతావి వస్తాయి. అదే 16 ఏళ్ల పాలసీ అయితే 35 శాతం బీమా మొత్తాన్ని 12, 14 సంవత్సరాల్లో లభిస్తుంది. 18 ఏళ్ల పాలసీ అయితే 40 శాతం మొత్తాన్ని 14వ ఏటా, 16వ ఏటా పొందొచ్చు. ఇక 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే 45 శాతం మొత్తాన్ని 16, 18 సంవత్సరాల్లో తీసుకోవాలి. ఆప్షనల్ రైడర్ ఫెసిలిటీ ఉంది. 15 ప్రాణాంతకర వ్యాధులకు ఇది వర్తిస్తుంది. నచ్చితే దీన్ని కూడా తీసుకోచ్చు.