బాలీవుడ్ లో ఉన్న ఖాన్ త్రయంలో అమీర్ ఖాన్ ఒకరు.. ఒకప్పుడు స్టార్ హీరోగా పరిశ్రమను ఏలినా ఇప్పుడు వయసు మీద పడ్డాక కుర్రాళ్ళ నుండి ఎక్కువగా పోటీ ఉండడంతో ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకోకపోతే స్టార్ హీరోలకు వైభవం తగ్గిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అమీర్ ఖాన్ సౌత్ సినిమా ఇండస్ట్రీకి దగ్గర అవ్వాలని చూస్తున్నారట. గతంలో లాల్ సింగ్ చద్దా తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. అందుకే ఈసారి పక్కా ప్లాన్ తోనే ముందుకు వస్తున్నాడని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమీర్ ఖాన్ తమిళ్ లో తని ఒరువన్ తో మోహన్ రాజా మరియు జయం రవి లు ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ మూవీ అందించారు. కాగా ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్ ను తీయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
ఇందులో జయం రవికి ప్రత్యర్థిగా అమీర్ ఖాన్ నటించనున్నాడని సౌత్ ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ఇక మరో సినిమాలో విజయ్ హీరోగా వెంకట ప్రభు డైరెక్షన్ లో రానున్న మూవీలోనూ కీలక పాత్రను చేయనున్నారు అమీర్ ఖాన్.