భారతదేశ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కీలకమైన నిర్ణయాలలో ఒకటి బ్రటిష్ వాళ్ళు పెట్టిన ఇండియా అన్న పేరు నుండి భారత్ గా మార్చాలి అనుకోవడం. అయితే ఈ మార్పును చాలా మంది స్వాగతిస్తున్నా రాజకీయంగా కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 18 నుండి 5 రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. దీనితో ఎలాగు పేరు మార్చడం పక్కా అని తెలుసుకున్న చాలా మంది భారత్ ను అమలులోకి తీసుకువస్తున్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక సినిమా టైటిల్ లో ట్యాగ్ లైన్ గా పెట్టిన ఇండియా కు బదులుగా భారత్ అని మార్చి పోస్టర్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన “మిషన్ రాణిగంజ్” ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ అన్నది ట్యాగ్ లైన్. అయితే ఈ ట్యాగ్ లైన్ లో ఇండియన్ అన్న పేరును తీసేసి భారత్ అని మార్చి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.
ఈ విధంగా నెమ్మదిగా అన్ని రంగాలలోనూ ఇండియా కు బదులుగా భారత్ ను మార్చుతున్నారు. కాగా అక్షయ్ నటించిన ఈ సినిమా అక్టోబర్ 6వ తేదీన థియేటర్ లలో రిలీజ్ కానుంది.