కోవ్యాక్సిన్ తీసుకున్న వారికి తమ దేశంలోకి ఎంట్రీ లేదని అమెరికా గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కో వ్యాక్సిన్ తీసుకున్నవారిని కూడా తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం నిమిత్తం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అమెరికా కూడా కోవ్యాక్సిన్ కు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా కొత్త ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసిన అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కో వ్యాక్సిన్ ను కూడా తమ జాబితాలో చేర్చింది. ఎల్లుండి నుండి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే మనదేశంలో కోవీషీల్డ్ తో పాటు కోవ్యాక్సిన్ ను కూడా ప్రజలకు ఇచ్చారు. దాంతో కోవ్యాక్సిన్ తీసుకున్నవారు అమెరికా వెళ్లాల్సి వస్తే ఎలా అని ఆందోళన చెందారు. కానీ తాజాగా అమెరికా వారికి గుడ్ న్యూస్ చెప్పింది.