దీపావళి కానుకంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో వాహనాదారులకు భారీ ఊరట లభించింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్ పై వ్యాట్ తగ్గించగా… ఇప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గించాలని రాష్ట్రాల పై కేంద్రం మరియు వాహనదారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు.. చమురు పై వ్యాట్ తగ్గించాయి.
ఈ నేపథ్యంలోనే… పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై అధ్యయనం చేస్తోంది తెలంగాణ సర్కారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అధికారుల్లో భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. వెంటనే తగ్గించే అవకాశం లేదని కొంత మంది అధికారులు అంటుండగా… మరి కొంత మంది తగ్గుతాయంటున్నారు.
కేంద్రం ఎక్సయిస్ సుంకం తగ్గించడం కారణంగా రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందని అధికారులు మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే… కేంద్ర నిర్ణయం తో ప్రతి నెల వంద కోట్ల రూపాయల ఆదాయం కోల్పోనుంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతంలో తెలంగాణ లో పెట్రోలో పై 35.2 శాతం వ్యాట్ అమలు అవుతుండగా… డీజిల్ పై 27 శాతం ఉంది. అయితే..ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ఉండటంతో… సీఎం కేసీఆర్ కూడా వ్యాట్ తగ్గించాలని ఆలోచన చేస్తున్నారట. దీనిపై త్వరలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.