ఎందుకు రా బాబూ ఇంత అతి అవసరమా…?

-

భారత్ కు అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు వస్తున్నారు. హా వస్తున్నారు సరే… అంతా బాగానే ఉంది. అవును డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా భారత్ లో అడుగు పెడుతున్నారు. బాగుంది… ఆయనకు ఆతిధ్యం ఇవ్వాలి. ఘనమైన ఆతిధ్యం ఇవ్వాలి. అందులో ఏ తప్పూ లేదు. అతిధిని గౌరవించడం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. ఏ దేశ అధ్యక్షుడు వచ్చినా , ఇతర దేశాల నుంచి ప్రముఖులు వచ్చినా స్వాగతం ఘనంగానే ఉంటుంది.

ఘనంగా ఉండటం అనేది మనకు గర్వకారణం. ప్రపంచ దేశాల మధ్య ఈ వాతావరణం అనేది చాలా అవసరం. ఓకే సరే దాన్ని కాదు అనలేము. గుజరాత్ లో పేదలు ఉండే చోట గోడ కట్టడం అంత అవసరమా…? ఆరు కోట్ల పెట్టి గోడలు కట్టి, చెట్లు పెట్టి మొక్కలకు రంగులు వేసారు. అదే ఆరు కోట్లు ఆ బతుకులు బాగు చేయడానికి ఖర్చు చేస్తే వాళ్లకు స్థిర నివాసాలు ఉండేవి కదా మాస్టారూ…?

సరే మీడియా అతి చూద్దాం. వస్తే వచ్చాడు… ఏదో అధ్యక్ష ఎన్నికల్లో భారత ఓట్ల కోసం వచ్చాడు. దాని కోసం ట్రంప్ కి బంగారు పళ్ళెం లో పెడుతున్నారు, ఫుడ్ ఇది. మోడీ ఈ బట్టలు వేసుకుంటున్నారు. మేలానియా ప్రేమ కథ, ఎందుకు గురూ ఈ సోది అంతా. వస్తున్నాడు సరే దాని కోసం రెగ్యులర్ వార్తలలో భాగంగా ఒక వార్త రాయొచ్చు తప్పు లేదు. ప్రత్యేక కథనాలు వేస్తున్నారు. లేనిపోని హడావుడి చేస్తున్నారు.

కూతురు వేసుకునే బట్టలు, ట్రంప్ వేసుకునే చెప్పులు ఇవన్ని కవర్ చేస్తుంది మీడియా. ఈ హడావుడి చైనా అధ్యక్షుడు వచ్చినప్పుడు చేయలేదు, మరో దేశ అధ్యక్షుడు వచ్చినప్పుడు చేయలేదు. ఎందుకు ఇంత పులిహోర. అమెరికాకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యత చూసి మధ్య ప్రాచ్య దేశాలు, గల్ఫ్ దేశాలు క్రూడాయిల్ ధరలు పెంచితే…? అంత అతి చేసి భారతదేశ విలువను దిగజారుస్తున్నారు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version