అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం (నవంబర్ 5)తో ముగిసింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ ట్రెండ్స్ వచ్చేశాయి. అయితే, ఇటీవల వచ్చిన సర్వే ఫలితాల అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ ముందంజలో ఉంది.
ఇప్పటివరకూ ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 198 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకున్నాడు. ఇక డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్ మాత్రం 112 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుతం స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్ హవా కొనసాగుతోంది. లీడ్‌లో ఉన్న ఉన్న రాష్ట్రాల్లోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతను చూపిస్తున్నారు. నేటి సాయంత్రం వరకు ఒక ఫర్ఫెక్ట్ రానుంది. కాగా, 272 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించిన అభ్యర్థి ప్రెసిడెంట్ కానున్నారు.