గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారు జామున ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైన మాదాపూర్ వద్ద ఓ కారు అతివేగంతో వచ్చి మెట్రో డివైడర్‌ను ఢీకొట్టి దాని పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అతివేగమేనని ఈ ప్రమాదానికి కారణమని నిర్దారణకు వచ్చారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగకుండా ఉండేందుకు టోయింగ్ వాహనంతో పూర్తిగా ధ్వంసమైన కారును అక్కడి నుంచి తొలగించారు. గాయాలపాలైన కారు డ్రైవర్‌కు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.